
ఛలో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి గోల్డెన్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రష్మికా మందన్న. చేసింది రెండు సినిమాలే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ కన్నడ అమ్మాయి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే గీతగోవిందం సినిమాతో రష్మిక మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో టాలీవుడ్లో రష్మికకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
అయితే ఈ నేపథ్యంలో ఓ వార్త సినీ అభిమానులని కుదిపేసింది. కన్నడలో రష్మిక నటించిన ‘కిరిక్ పార్టీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో తన కోస్టార్‌గా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డ రష్మిక అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఎంగేజ్మెంట్ రద్దైంది. అయితే ఇప్పుడు రష్మిక మరో షాక్ ఇచ్చింది. రక్షిత్ హీరోగా నటిస్తున్న ‘వ్రిత్రా’ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
‘‘అందరికి నమస్కారం, మీరు అందరు పండుగ ఘనంగా జరిగిందని అనుకుంటున్నా. నేను వ్రిత్రా సినిమాలో నటించడం లేదని మీ అందరికి తెలియజేస్తున్నా. కెరీర్ ఆరంభ దశలో ఇది సరైన నిర్ణయం కాదని నాకు తెలిసు. కానీ నేను చాలా ఆలోచించి డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి ఈ విషయాన్ని చెప్పాను. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. ఇక నా స్థానం వచ్చే వాళ్లు ఇంకా అద్భుతంగా చేస్తారని కోరుకుంటున్నా. గౌతమ్, చిత్ర యూనిట్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్యూ’’ అంటూ రష్మిక ఓ లెటర్ని ట్వీట్ చేసింది.
#rashmika_mandanna, #Kannada, #rakshitshetty