Rangasthalam Exclusive Public Review On Premier Shows

Rangasthalam Exclusive Public Review On Premier Shows | Ram Charan Rangasthalam Public Talk | #3in1

ఈ ఏడాది వేసవిలో సందడి చేయబోతున్న క్రేజీ చిత్రాలలో రంగస్థలం చిత్రం కూడా ఒకటి. సుకుమార్ శైలిలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలినుంచీ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా ఈ చిత్రంలో ప్రయోగమే చేయబోతున్నాడు. చరణ్ ఈ తరహా పాత్రలో గతంలో నటించలేదు. రంగస్థలం లాంటి చిత్రం కూడా తెలుగులో ఈ మధ్య కాలంలో రాలేదు. ఈ శుక్రవారం రంగస్థలం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రంగస్థలం చిత్రానికి సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. యూఏఈ నుంచి రంగస్థలం చిత్రానికి తొలి రెస్పాన్స్ అదిరిపోయింది.
ఇప్పటి వరకు మాస్ యాక్షన్ తో మెరుపులు మెరిపించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ రంగస్థలం చిత్రంలో కొత్తగా కనిపించబోతున్నాడు. రాంచరణ్ చిట్టిబాబుగా మారి సందడి చేయబోతున్నాడు. 1985 నాటి పరిస్థితులకు అనుగుణంగా చరణ్ ఏవిధంగా నటిస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
సుకుమార్ రంగస్థలం చిత్రంలో రాంచరణ్ ని వినికిడి లోపం ఉన్న యువకుడిగా చూపించబోతున్నాడు. చరణ్ వంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోని వినికిడి లోపంతో చూపించడం అంటే సాహసమే. కానీ అదే అంశం అభిమానులకు బాగా చేరువైంది. టీజర్ ట్రైలర్ లో రాంచరణ్ నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. ఇక వెండి తెరపై ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనివుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *