
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది… ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా… ఆయనకు జోడిగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్రలో మరో ముఖ్యమైన పాత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు… ఈ పాత్రపై పలు వార్తలు వచ్చినా… మొత్తానికి ఈ సస్పెన్స్‌కు తెరదించారు దర్శకుడు క్రిష్… ఈ పాత్రకు రానా సరిగ్గా సరిపోతాడని భావించిన క్రిష్… ఆ పాత్రకోసం రానాను సెలెక్ట్ చేసుకున్నాడు.
అయితే మరోవైపు రానా దగ్గుబాటి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని… శస్త్రచికిత్స కోసం వచ్చేవారం అమెరికా లేదా సింగపూర్ వెళ్లారనే రూమర్స్ వచ్చాయి. రానాకు ఆయన తల్లి లక్ష్మి మూత్రపిండాన్ని దానం చేస్తోందన్న వార్త హల్చల్ చేస్తోంది. ఈ రూమర్స్‌పై వారి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు రానాకు ఎలాంటి సమస్యలు లేవని కొట్టిపారేస్తున్నా ప్రచారం ఆగడంలేదు… దీంతో తాజాగా ఈ వార్తలను ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఖండించారు. రానాకు ఎలాంటి సమస్యలు లేవని… ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమయ్యాడని… దర్శకుడు క్రిష్ చెప్పే స్క్రిప్ట్ వినడానికి రేపటి నుంచి సిట్టింగ్ ఉంటాయని తెలిపారు సురేష్ బాబు. ఇక రానా ఆరోగ్యసమస్యలపై పుకార్లను నమ్మవద్దు… అలాంటి ఏమైనా ఉంటే రానానే సోషల్ మీడియాలో తన అభిమానులకు తెలియజేస్తారని పేర్కొన్నారాయన.