చరణ్‌ చిత్రం పేరేంటి?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కైరా అడ్వాణీ కథానాయిక. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అజర్‌ బైజాన్‌లో జరుగుతోంది. కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పేరుని ఇంకా నిర్ణయించలేదు. అయితే ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం మేరకు ‘స్టేట్‌రౌడీ’ అనే పేరును పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. చిరంజీవి కూడా ఇదివరకు ఆ పేరుతో సినిమా చేశారు. మరి తన తండ్రి సినిమా పేరుకే చరణ్‌ ఓటేస్తాడా లేక కొత్త పేరుని ఖరారు చేస్తారా అనేది చూడాలి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *