ఆ సినిమా చాలా నిరాశ‌ప‌రిచింది: రామ్‌చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి వారసుగా తెరంగేట్రం చేసిన రామ్‌చ‌ర‌ణ్ తెలుగు తెర‌పై స్టార్‌హీరోగా ఎదిగాడు. ఇటీవ‌ల విడుద‌లైన `రంగ‌స్థ‌లం` సినిమాతో మంచి న‌టుడిగా కూడా నిరూపించుకున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో న‌టిస్తున్నాడు. తాజాగా చెర్రీ త‌న కెరీర్ గురించి జాతీయ మీడియాతో మాట్లాడాడు.

`కొన్నేళ్ల‌కింద‌ట చేసిన `జంజీర్‌` సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాను. ఆ సినిమా కోసం ఎంతో శ్ర‌మ‌ప‌డ్డాను. ఎంతో న‌మ్మ‌కంతో వంద శాతం క‌ష్ట‌ప‌డ్డాను. అయితే ఆ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ సినిమా ఫ‌లితం న‌న్ను చాలా నిరాశ‌ప‌రిచింది. అలాగ‌ని, బాలీవుడ్ ప్ర‌య‌త్నాల‌ను మానుకోను. మంచి క‌థ దొరికితే బాలీవుడ్ సినిమాలో క‌చ్చితంగా న‌టిస్తాన‌`ని చెర్రీ చెప్పాడు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *