
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్యం లో రూపొందుతున్న చిత్రానికి వినయ విధేయ రామ టైటిల్ ను ఖరారు చేశారు. రామ్ చరణ్ కి ఇది 12వ చిత్రం. దీపావళి పండుక సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చరణ్ యాక్షన్ లుక్లో కనిపిస్తున్నాడు.ఇక ఈ మూవీ టీజర్ ను ఈ నెల 9వ తేదిన విడుదల కానుంది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి. స్నేహ, చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ మీకోసం.