రాజమౌళి మల్టీస్టార్ మూవీఫై బాలీవుడ్ కన్ను

‘బాహుబలి’ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. రాజమౌళి రూపుదిద్దిన ఈ కళాకండాన్ని హిందీ వెర్షన్ లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా భారీస్థాయిలో ప్రచారం చేసి విడుదల చేశారు. ఈ సినిమా కరణ్ కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

రాజమౌళి తాజా చిత్రమైన మల్టీస్టారర్ ను తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు, కానీ బారి బడ్జెట్ సినిమా కావటం వలన దీనిని హిందీలో కూడా విడుదల చేయాలని అందుకు కరణ్ జొహార్ ని రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ .. రామ్ చరణ్ నటించే ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *