
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అరెస్ట్ హిందీ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష విధిస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కష్టాల్లో పడ్డారు. సల్మాన్‌కు మద్దతునిస్తూ ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు చేశారు.
తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా సల్మాన్‌కు పరోక్షంగా మద్దతు పలుకుతూ ట్వీట్ చేశాడు. `గత 20 సంవత్సరాలలో వేల సంఖ్యలో కృష్ణ జింకలు చనిపోయాయి. అది పెద్ద విషయం కాదు. అలాగే ప్రతీరోజూ కోట్ల సంఖ్యలో ఆవులను, మేకలను, పందులను మనం చంపుతున్నాం. వాటి ప్రాణాలకు విలువ లేదు` అని పూరీ కామెంట్ చేశాడు.