
ఈ టాలీవుడ్ నిర్మాతకి చాలా పెద్ద బ్యానర్ ఉంది.ఇండస్ట్రీ లో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తనదైన స్టయిల్ లో సాల్వ్ చేస్తారు ఈ బడా ప్రొడ్యూసర్. ఇప్పుడీ నిర్మాత వద్దకు యూఎస్-టాలీవుడ్ సెక్స్ రాకెట్ బాధితురాలు వచ్చింది. తనను ఈ వివాదం నుంచి ఎలాగోలా బయటపడేయాలని ఆ సీనియర్ ప్రొడ్యూసర్ ను కోరిందామె.
చికాగో-టాలీవుడ్ సెక్స్ రాకెట్ కు సంబంధించి ఇప్పటికే పలువురు భామల పేర్లు తెరపైకొచ్చాయి. 3 రోజుల కిందట వచ్చిన ఐదుగురు హీరోయిన్ల పేర్లలో ఈమె పేరు లేదు. తాజాగా బయటపడిన మరికొన్ని మొబైల్ ఛాటింగ్స్, స్క్రీన్ షాట్స్ లో మాత్రం ఈమె పేరు బయటకొచ్చింది. దీంతో ఇప్పుడీ హీరోయిన్ టెన్షన్ పడుతోంది. తన పేరు బయటకు రాకుండా చూడాలని సదరు బిగ్ ప్రొడ్యూసర్ ను ప్రాధేయపడుతోంది.
నిజానికి తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ కాదు. మూడేళ్ల కిందటే ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్క హిట్ లేదు. ఓ హాస్యనటుడితో సినిమా చేసినప్పటికీ అది హిట్ అవ్వలేదు. భారీ అంచనాల మధ్య గతేడాది చేసిన మరో సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఇలా తెలుగులో కేవలం 4 సినిమాలే చేసిన ఈ భామ ఇప్పుడు ఫొటోషూట్స్ తోనే కాలక్షేపం చేస్తోంది.
ప్రస్తుతం ఆమె టెన్షన్ చూస్తుంటే, యూఎస్-టాలీవుడ్ సెక్స్ రాకెట్ లో ఆమెను బాధితురాలు అనలేం. కావాలనే డబ్బు కోసం ఆమె అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అగ్ర నిర్మాత చెంతకు చేరి రక్షించమని కోరుకుంటోంది.
రీసెంట్ గా ఇలాంటి ఓ సెక్స్ ఆరోపణల వివాదాన్ని సక్సెస్ ఫుల్ గా పరిష్కరించిన ఆ నిర్మాత, ఈ ఫ్లాప్ హీరోయిన్ ను కూడా ఒడ్డున పడేస్తాడేమో చూడాలి.
Source : https://telugu.greatandhra.com/politics/gossip/meere-diku-bada-nirmatha-heroine-91373.html