అర్ధరాత్రి బెజవాడ టీడీపీ లో కలకలం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ ప్రజాశ్రేయస్సు కోసం పాటు పడుతూ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం మాకేం పట్టింది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 
విజయవాడ నాయకుల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా విజయవాడ నగరంలోని భవానీపురం ప్రాంతంలో టాస్క్ ఫోర్సు పోలీసులు ఒక పేకాట శిభిరం పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6 వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Related image
అయితే ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. పేకాట ఆడుతూ దొరికిన వారు పోలిసుల పై చిందులు వేయడం మొదలుపెట్టారు. అసలు వీరు ఎవరా అని ఆర తీసిన పోలీసులకి మైండ్ పోయినంత పని అయ్యింది. దొరికిన ఆరుగురులో ఇద్దరు అధికార టిడిపిలో కీలక నాయకులు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మాజీ కార్పొరేటర్లు. ఒకరు విజయవాడ భవానీపురం మాజీ కార్పోరేటర్ పత్తి నాగేశ్వరరావు కాగా మరొకరు 33వ డివిజన్ మాజీ కార్పోరేటర్ కరిముల్లా.
అయితే ఇలాంటి విషయాలని ఎలా బయటకి రాకుండా మట్టుపెట్టలో బాగా అనుభవం ఉన్న భవానీపురం మాజీ కార్పోరేటర్ అరెస్ట్ విషయం గోప్యంగా ఉంచి అసలు ఏమీ జరగనట్లు వ్యవహరించేందుకు పెద్ద స్థాయిలోనే పైరవీలు నడిపి ఎట్టకేలకు న్యాయాన్నీ ఎగతాళి చేస్తూ గెలిచాడు. అరెస్ట్ చేసిన వారే సలాం కొట్టి వెళ్ళేలా చేసారంట. ఈ మొత్తం వ్యవహారంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సైతం చేతులు మారినట్లు ఆ ప్రాంతంలో వినికిడి. చిన్న చిన్న విషయాలే పెద్దదిగా చెప్పే మీడియాకి సైతం విషయం తెలిదా? లేక వారిని కూడా అదుపు చేశారా? కేవలం ఒకే ఒక్క ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ గా రావడంకి కారణం ఏంటి అనేది చూస్తేనే ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయో తెలుస్తుంది.
Related image
ఏది ఏమైనా బెజవాడ తెలుగుదేశంపార్టీ నాయకులు ఇలాంటి చర్యలు చేస్తున్న వారిని ఇంకా తమ పార్టీ నాయకుడు అని ఎందుకు వెనకేసుకు వస్తున్నారో వారికే తెలియాలి…. ఇది ఒక్క భావానీపురం మాజీ కార్పోరేటర్ చేసిన దుశ్చర్య మాత్రమె కాదు ఇలాంటి వారిని కొమ్ము కాస్తున్న అధికార పార్టీ, ఇప్పటి వరకు బయటకి చెప్పని అధికారులు, కనీసం విషయం చెప్పని మీడియా…వీరందరి పైనా ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న చేతులు మారీన డబ్బు…. జరిగింది తప్పు అనుకుంటే పై అధికారుల వరకు చేరే దాకా షేర్ చేద్దాం….
Chat Conversation End

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *