
అక్టోబర్లో పోలవరం మొదటి గేటు ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు
పోలవరం నిర్మాణం 56 శాతం పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అక్టోబర్లో పోలవరం మొదటి గేటు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రతిపక్షాలు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టిసీమను అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలే తిప్పికొడతారన్నారు.