పెళ్లి చూపులకు వచ్చి… పెళ్లయిన అక్కను తీసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు..

పెళ్లి చూపులకు వచ్చి… పెళ్లయిన అక్కను తీసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు..
ఓ ప్రబుద్ధుడు చిన్నకూతురిని చేసుకునేందుకు పెళ్లిచూపులకు వచ్చి పెళ్లయిన పెద్ద కూతురిని లేపుకెళ్లాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 వయసు గల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చిన్న కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న ఆయన సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో అన్నాదురై (28) అనే వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి అమ్మాయిని చూశాడు. ఇదే సమయంలో పెద్దమ్మాయితో మాటలు కలిపి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లిపోయాడు. పెళ్లిచూపుల గురించి అమ్మాయి తండ్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే పెద్దమ్మాయితో టచ్‌లో ఉన్నాడు.
Image result for INDIAN MARRIAGES

ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో పెద్దకూతురు ఇల్లు వదిలి లేచిపోయింది. తన చిన్నకుమార్తె పెళ్లిచూపులకు వచ్చిన అన్నాదురైతో పెద్ద కుమార్తె లేచిపోయిందని ఆలస్యంగా తెలుసుకున్న తండ్రి మైలాపూరు పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశాడు. ఆమె వెళ్తూ వెళ్తూ ఇంటిలోని ఐదు సవర్ల నగలు, రూ.2లక్షలు డబ్బును తీసుకుని మూడేళ్ల కుమారుడితో సహా పారిపోయిందని పేర్కొన్నాడు. వారి కోసం పోలీసులు గాలింపు చెర్యలు చేపట్టారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *