మా అబ్బాయి అకిరా ఎన్టీఆర్ అభిమాని : పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అతని సినిమాల కోసం అభిమానులు చేసే హాంగామా మామూలుగా ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో హీరోలను బీభత్సంగా అభిమానిస్తుంటారు. గత ఏడాది ఎన్టీఆర్, పవన్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన లో పవన్ అభిమాని మృతి చెందాడు. దాని తర్వాత వీళ్లు సోషల్ మీడియాలో ఒకరి హీరో మీద ప్రేమతో ఇతర హీరోలను ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ విషయం మన హీరోలు కూడా అభిమానులను మందలించినప్పటికి మార్పు మాత్రం ఏం లేదు.

నిన్న రాత్రి పవన్ ను కొంత మంది అభిమానులను కలిశారు. అక్కడ ఈ విషయమై పవన్ ఒక వీరాభిమానితో మాట్లాడుతూ ” నువ్వు తారక్ ఫ్యాన్ తో ఎందుకు గొడవ పడుతున్నావ్. నా కొడుకు అఖిరా ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయన డ్యాన్స్ లంటే అఖిరా కు చాలా ఇష్టం. అందరితో కలిసి నాతో పాటుగా సమాజాన్ని మార్చడానికి రండి తేకపోతే పోండి అంతే గాని ఇతర అభిమానులతో గొడవలు వద్దు” అంటూ అభిమానులకు సూచించారంట.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *