అరకులో రిసార్టుకే పరిమితమైన పవన్‌

విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని శనివారం రాత్రి అరకులోయ చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదివారం పూర్తిగా రిసార్టుకే పరిమితం అయ్యారు. పద్మాపురం గార్డెన్స్‌ సమీపంలోని ఒక ప్రైవేటు రిసార్టులో బసచేసిన ఆయన ఉదయం ఆ ఆవరణలోనే అరగంటపాటు వాక్‌ చేశారు.

తిరిగి తన గదిలోకి వెళ్లిపోయారు. తరువాత పవన్‌ను కలవడానికి పాడేరుకి చెందిన కొంతమంది జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతోపాటు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఎవ్వరినీ కలవలేదు. కాగా, సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్‌.కోట పర్యటన నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ టూర్‌ షెడ్యూల్‌ను మార్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *