లోకేష్‌ని చూసి పవన్ కల్యాణ్ బయపడుతున్నాడు .. ఈ మాట అన్నదెవరో తెలుసా?

సీఎం అవడానికి ఎందుకు అంత తొందర, మీ తాత ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సీఎం అయ్యారని లోకేష్‌ని పవన్ అంటున్నారని, అసలు లోకేష్ సీఎం కావాలనుకుంటున్నట్లు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు ఆయనతో కలిసి ఉన్నారు లోకేష్. ఎలాంటివారో మీకు తెలియదా? అని అడిగారు. లోకేష్‌కు సంబంధించి చేస్తున్న వితండవాదాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని టీడిపీ డిమాండ్ చేస్తోందన్నారు.

Image result for pawankalyan lokesh

సీఎం పదవి అంటే వడ్డించిన విస్తరికాదని, ఉర్రూతలూగించే ప్రసంగాలు, ఆవేశంతో ఊగిపోవడం కాదన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి పని చేసిన పవన్ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికతో రాజకీయాలలోకి వచ్చినట్లు, తనకు సీఎం కావాలని లేదని చెప్పారన్నారు. ఇప్పుడు చంద్రబాబు, జగన్, పవన్‌లలో ఎవరిని సీఎం చేస్తారని అడుగుతున్నారని, ఎవరిని సీఎం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. సమాజంపైన, భారతీయ సంస్కృతిపైన, కుటుంబ వ్యవస్థపైన, పెళ్లిళ్లపైన పవన్‌కు అవగాహన లేదన్నారు. అవగాహన ఉన్న నాయకుడిలా కనిపిస్తారని, అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించడంలేదని అడిగారు.

Image result for pawankalyan lokesh

చంద్రబాబు యూ టర్న్ తీసుకోలేదని, మోడీ తీసుకున్నారన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం సందర్భంగా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఆయన అన్న చిరంజీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడంలేదన్నారు. విభజన సమయంలో ఆయన ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి నాయకుడుగా ఉన్న పవన్ తన అన్న పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ పోటీ అభ్యర్థుల నుంచి పొలాలు, స్థలాలు, ఇళ్లు రాయించుకొని రాజకీయాలను కలుషితం చేశారన్నారు.

Image result for pawankalyan lokesh

పవన్ ఒకసారి తనకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే చాలంటారు, అంటే అన్న 18 మంది ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి పదవి చేపట్టినట్లు రుజువు చేయడంతో తను కూడా సీఎం అవవచ్చని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆయన మాటలు పొంతనలేని విధంగా ఉంటాయన్నారు. జనసేన ప్రజారాజ్యం-2గా లేక ఆ పార్టీ అవశేషంగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. పవన్‌కు దగ్గరగా ఉన్న లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ, కమ్యునిస్టులు ఒక్కొక్కరుగా అతనిని వదిలివేశారని చెప్పారు. ఆయన మాట తీరును చూసిన ప్రజలు మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్లుగా భావిస్తున్నారన్నారు.

Related image

2019 ఎన్నికల్లో మీ రంగు బయట పడుతుందని, ప్రజాక్షేత్రంలో సమాదానం చెబుతామని అన్నారు. పిడికిలి ఐక్యతకు చిహ్నం కాదని, తిరుగుబాటుకు గుర్తు అని స్పష్టం చేశారు. మొదట్లో కులమత బేధాలు లేవన్న పవన్ ఇప్పుడు తను కాపు కులం అయినందునే చంద్రబాబు నాయుడు గౌరవించారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని పలు అంశాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిపి సంక్షేమ పథకాలతో అభివృద్ధివైపు తీసుకువెళ్లే చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు చేయడం తగదన్నారు. పలు విషయాలలో రాష్ట్రం టాప్ టెన్‌లో ఉన్నట్లు జూపూడి తెలిపారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *