నాకు సంస్కారం ఉంది బాలకృష్ణ లాగా తిట్టలేను..

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడ నుండి తుని వరకు రైలు పర్యటన చేశారు. తుని స్టేషన్ కి చేరుకోగానే అభిమానులు, పార్టీ కార్యకర్తలు జనసేనాని ఘనస్వాగతం పలికారు. అయితే గొల్ల అప్పారావు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.

అయితే ఈ సభలో దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని చూస్తూ పవన్ మాటాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పేందుకే టీడీపీ పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యారు. ఇప్పుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడైన మీరు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టాడని చంద్రబాబు ను విమర్శించాడు.

మీకు సీఎం పదవి కాలంటే రాహుల్ గాంధిని కాదు మాఇంటికి రండి, నేను మీకు అండగా ఉంటాను. మీ హక్కులు నేను చెబుతాను అంటూ మాట్లాడారు. అదే సభలో తాను బీజేపీ తో కానీ, వైస్సార్సీపీతో కానీ
టీడీపీతో కానీ పొత్తు పెట్టుకొనని అన్నారు. అయితే పవన్ మాట్లాడుతుండగా అక్కడ తోపులాట జరిగింది. దీనితో కోపాన్ని దిగమింగుకొని, నేని బాలకృష్ణ లాగా ఎవరిని కొట్టను అంటూనే వెంటనే మాటమార్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని చూస్తూ తెలుగు వారి ఆత్మగౌరవమంటూ మాట్లాడుతూ అక్కడివారిని కన్పూజ్ చేసాడు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *