రేణు ఎంగేజ్‌మెంట్‌పై స్పందించిన పవన్

హైదరాబాద్: తన మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఎంగేజ్‌మెంట్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కొత్త జీవితం ప్రారంభిస్తున్న శుభవేళ భగవంతుడు ఆమెకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, అభివృద్ధిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానని చెప్పారు.

రేణు-పవన్‌కు గతంలో అకీరా, అద్య జన్మించారు. రేణుతో విడాకుల తర్వాత పవన్ రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను వివాహమాడారు. మరోవైపు ఉంగరాలు మార్చుకున్న ఫొటోను రేణు దేశాయ్ రెండ్రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తనకు నిశ్చితార్థం జరిగిందని తెలిపారు. బాధనుంచి కోలుకునేందుకు సహకరించినందుకు తనకు కాబోయే భర్తకు ధన్యవాదాలు తెలిపారు. అయితే కాబోయే భర్త పేరు, వివరాలు వెల్లడించడానికి ఆమె ఇష్టపడలేదు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *