
‘‘రోజుకో మాట మార్చడం సీఎం చంద్రబాబుకు అలవాటే. రాబోయే రోజుల్లో ప్రధా ని మోదీతో గాఢ ఆలింగనం చేసుకున్నా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్, బీజేపీ, ప్రధాని మోదీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘‘ఏపీ ప్రత్యేక హోదా పై ఇచ్చిన మాటను బీజేపీ తప్పింది. దానివల్ల ఆ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయింది’ అని విమర్శించారు. మోదీ తనకు స్నేహితుడు కాదని, బంధువు అంతకంటే కాదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో హామీ నిలబెట్టుకో ని ఆయనను మొదటిరోజు నుంచీ తప్పు పడుతూనే ఉన్నానని చెప్పారు. అప్పట్లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూతో సమానమని నేనంటే..
పవన్‌కల్యాణ్‌ది అనుభవరాహిత్యం అంటూ టీడీపీ తె గ ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. బీజేపీని, టీడీపీ లను ప్రజలు నమ్మే స్థితిలో లేనేలేరన్నారు.
‘‘టీడీపీ తప్పులను నేను ప్రశ్నిస్తుంటే.. బీజేపీని వెనుకేసుకొస్తున్నానని అంటున్నారు. ప్రజలనే వెనుకేసుకొస్తా. వారి వెన్నంటే నిలుస్తా. ప్రజల కన్నీళ్లు తుడుస్తా’’ అని పేర్కొన్నారు. జగన్‌లా తన దగ్గర కోట్ల రూపాయలు లేవని వ్యాఖ్యానించారు. ‘జగన్‌ని ఏమడిగినా.. సీఎం అయ్యాక అంటారు’ అని దుయ్యబట్టారు. అన్ని సామాజికవర్గాలతోపాటు కాపులకు కూడా తెలుగుదేశం ద్రోహం చేసిందని, భీమవరంలో బీసీ సోదరులు తనను కలిసి.. ప్ర భుత్వం చేసిన అన్యాయం చెప్పుకొని బాధపట్టారన్నా రు. మరోసారి టీడీపీని ఎన్నుకుంటే మళ్లీ ద్రోహామే ఎదురవుతుందన్న ఆయన… 2019 ఎన్నికలు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ‘మాట్లాడితే చాలు మరోసారి తనను సీఎం చేయమని చంద్రబాబు అం టారు. ఆ తరువాత తన కుమారుడిని చేయమంటారు. జగన్మోహన్రెడ్డి అయితే.. సీఎం అయితేనే చేస్తానంటా రు.