
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయవాడ నుంచి తుని వరకు రైలు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. తునిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ నేత చంద్రబాబుపై మండిపడ్డారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అంటూ చంద్రబాబు ను విమర్శించారు. చంద్రబాబు కేవలం తన అధికార పీఠాన్ని కాపాడుకు నేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకునే సమయం ఆసన్న మైందన్నారు. రాజకీయ వ్యవస్థ సమూలంగా మారాలని. అదే యువత లక్ష్యం కూడా అయన అన్నారు. అందుకే లక్షలాదిగా యువత తన సభలకు వస్తున్నారని, పైగా కవాతుకు వచ్చారని అన్నారు. అదేదో తనకోసం అంత పెద్ద సంఖ్యలో రాలేదని, కేవలం సమాజంలో మార్పుకోరుకుంటున్నారు కనుకనే అంత పెద్ద సంఖ్యలో కవాతుకు లక్షలాదిగా తరలివచ్చారని అన్నారు.. వ్యక్తుల,పార్టీలు ముఖ్యంకాదు.. ప్రజలే ముఖ్యం… ప్రజలు కచ్చితమైన మార్పు కోరుకుంటున్నారు అని పవన్ అన్నారు.
నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకొనని అయన అన్నారు. కేవలం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే యాత్రలు చేస్తున్నారని అధికారం కోసం కాదని అయన అన్నారు రాజకీయాలను శాసించేది ప్రజా సమస్యలే.. రాజ కీయాలు, నాయకులు కాదు.. ప్రజా సమస్యలపై రాజకీయం చేస్తే ప్రజల్లో తిరుగుబాటు తప్ప దన్నారు. రాజకీ సమీ కరణలు రాజకీయాలను ఎంత మాత్రం శాసిం చలేవని పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు.
అయితే నిన్న రైలు ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎదో చదువుతున్నాడు. అది చుసిన నెటిజన్లు సభలో మాట్లాడానికి స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దానికి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అయితే పవన్ కు ఈ స్క్రిప్ట్ అందించేది త్రివిక్రమ్ అని ఇప్పటివరకు జనం అనుకున్నారు. తాజాగా పవన్ కు స్క్రిప్ట్ ఇచ్చేది త్రివిక్రమ్ కాదని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అని వార్తలు వెలువడుతున్నాయి. అసెలే పెద్ద హీరో, పైగా స్క్రిప్ట్ పక్కాగా ఉండటంతో అంతటి పెద్దహీరో ఏ విధంగా నటిస్తాడో ప్రేత్యేకంగా చెప్పనక్కరలేదు