
ఆ హీరోని ఎదురించినందుకే అవకాశాలు లేవు: పార్వతి మీనన్
Parvathy Menon Sensational Comments in front of media
మలయాళం నటుడు దిలీప్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేసింది అక్కడ నటి పార్వతి మీనన్. గతంలో ఈ నటుడు ఓ ప్రముఖ మలయాళ నటిని అపహరించి, లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఆ తర్వాత దిలీప్ బెయిల్పై బయటకి వచ్చారు. ఆ సమయంలో ఆయనను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ‘అమ్మ’ నుంచి ఆయన్ను తొలగించాలని పార్వతి మీనన్, రేవతి తదితర (‘WCC’ తరఫున) నటీమణులు డిమాండ్ చేశారు. అప్పుడు మోహన్ లాల్ ఆయన్ను రాజీనామా చేయిచాడు.
ఇప్పుడు ఆ స్టార్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన అభిమానుల నుంచి చాల ఇబ్బంద్దులు ఎదుర్కొంటున్నానని పార్వతి మీనన్ చెప్పుక్కుకొచ్చారు. మలయాళంలో నటులను దేవుడిలా కొలుస్తారు. వారిపై ఎవరైనా నటీమణులు విమర్శలు చేస్తే ఆ చిత్ర పరిశ్రమ వదిలేస్తుంది. నేను ప్రస్తుతం భయంతో జీవిస్తున్నా’ అని అన్నారు పార్వతి మీనన్.
Malayalam Actress Parvathi Meenan