
నట సార్వ భౌమ నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. జాగర్లమూడి క్రిష్ దర్శకత్యం వహిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రోజుకోవార్త వెలువడుతూనే ఉంది. ఈ మధ్యనే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఏంటో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన నటి నటులు, అదేవిధంగా రాజకీయాల్లో తన వెన్నెంటే ఉండి నడిచిన నాయకుల పాత్రలు కూడా ఈ చిత్రంలో ఉండేటట్లు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
ఈ కోవలోనే ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అయన మనమడు సుమంత్, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో అయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు. ఇక పోతే ఎన్టీఆర్ అల్లుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాత్రని దగ్గుపాటి రాణా పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ రెండొవ భార్య లక్ష్మిపార్వతి పాత్రలో ఆమనీ నటిస్తుంది.
ఇక విషయానికి వస్తే టాలీవుడ్ లో ఈ సినిమాలో ఓ వార్త తెగ వినిపిస్తుంది. అదేమిటంటే అనంతపురం రాజకీయాలలో పేరొందిన కుటుంబాలలో పరిటాల రవి గారి కుటుంబం ఒకటి. ఎన్టీఆర్ పార్టీ టికెట్ ఇచ్చి ఎంమ్మెల్యే గా నిలబడిన తొలిప్రయత్మలోనే గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు పరిటాల రవి.ఎన్టీఆర్ రవిలు ఇద్దరు సొంత అన్నదమ్ముల ఉండేవారు. ఎన్టీఆర్ అంటె రవికి ప్రత్యేక అభిమానము ఉండేది. అయితే ఇప్పుడీ ఈ సినిమాలో రవి పాత్రని కూడా పెట్టాలని బాలయ్య బాబు క్రిష్ అనుకుంటున్నారని తాజా సమాచారం. ఈ పాత్రకి ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నా తరుణంలో రక్త చరిత 1 అండ్ 2 రవి పాత్ర చేసి తెలుగు ప్రజలని మెప్పించిన వివేక్ ఓబే రాయ్ ని తీసుకొవాలని క్రిష్ అనుకున్నట్టు తాజా సమాచారం. చూద్దాం మరి చివరికి ఏమవుతుందో..