సాఫ్ట్ వేర్ అమ్మాయిలకు వల వేసిన పాన్ షాపు ఓనర్

హైదరాబాద్.. గల్లీ గల్లీలో కనిపించేవి పాన్ షాపులు. అలాంటి పాన్ షాపులకే బ్రాండ్ వేసిన తెలివైన యువకుడు. మయూరి పాన్ హౌస్ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్ లో పలు పాన్ షాపులు నిర్వహిస్తున్నాడు. మయూరి పాన్ ఎంత స్వీటుగా ఉంటుందో.. ఈ ఓనర్ ఉపేందర్ వర్మ మాటలు కూడా అంతే తియ్యగా ఉంటాయి. కస్టమర్ల నోటిని ఎలా పండిస్తాడో.. తన మాయమాటలతో అమ్మాయిలకు అలాగే వల వేస్తాడు. ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలతో మాటలు కలుపుతాడు.. ఆ తర్వాత జల్సాలు చేస్తాడు.
మయూరి పాన్ షాపు ఓనర్ ఉపేందర్ వర్మకు సిటీలోని పాన్ షాపుల వ్యాపారం ఉంది. కిళ్లీలు బాగా కడతాడనే పేరుంది. ఈ పాపులారీటీతో వచ్చిన డబ్బు కూడా బాగా సంపాదించాడు. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. ఇతని వలలో పడిన ఓ అమ్మాయి ఫొటోలు, వీడియోలు తీశాడు. యూట్యూబ్ లో పోస్ట్ చేస్తానని.. ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించాడు. స్వీట్ పాన్ లో మత్తు పదార్దాలు కలిపి.. ఆ తర్వాత పలుసార్లు ఆ యువతిపై అత్యాచారం చేశాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావటంతో ఆ యువతి కాచిగూడ పోలీసులకు కంప్లయింట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ తర్వాత ఉపేందర్ వర్మను అరెస్ట్ చేశారు. అత్యాచారం సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అతనికి సహకరించిన స్నేహితుడు రాజేష్, మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

ప్రస్తుతం ఒక్క అమ్మాయి మాత్రమే కంప్లయింట్ ఇచ్చిందని.. ఇంకా ఎవరెవరిని ట్రాప్ చేశాడు.. ఇంకెవరైనా బాధితులు ఉన్నారా.. ఇంకెవరి ఫొటోలు, వీడియోలు తీశాడా అని కూడా విచారణ చేస్తున్నాం అని తెలిపారు కాచిగూడ పోలీసులు. ఇతని ఎంజాయ్, అమ్మాయిలను ట్రాప్ చేసే విదానం చూస్తే.. ఎర్రగులాబీలు సినిమా గుర్తుకు రావటం విశేషం…

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *