కారులోనే గ్యాంగ్‌రేప్ చేస్తామ‌ని బెదిరించాడు

బెంగళూరు లో ఓలా ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని విమానాశ్ర‌యానికి బ‌య‌లుదేరిన ఓ సాఫ్ట్వేర్ మ‌హిళా ప్ర‌యాణికురాలి ప‌ట్ల డ్రైవ‌ర్ దౌర్జ‌న్యం చేశాడు. కారును లాక్ చేసి, ఆమె దుస్తుల‌ను లాగాడు. అరిచావంటే త‌న ఫ్రెండ్స్‌ను పిలిపించి, కారులోనే గ్యాంగ్‌రేప్ చేస్తామ‌ని బెదిరించాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. 26 సంవ‌త్స‌రాల బాధితురాలు ఓ ఆర్కిటెక్చ‌ర్‌. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం బెంగ‌ళూరు నుంచి ముంబై వెళ్లాల్సి ఉంది.

దీనికోసం ఆమె బెంగ‌ళూరు కోడిహ‌ళ్లి నుంచి విమానాశ్ర‌యానికి ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నారు. స‌గం దూరం వెళ్లిన త‌రువాత క్యాబ్ డ్రైవ‌ర్ విమానాశ్ర‌యం మార్గంలో కాకుండా వేరే దారిలోకి కారును మ‌ళ్లించాడు. విమానాశ్ర‌యం స‌మీపంలో నిర్జ‌న‌ ప్రదేశానికి కారును తీసుకెళ్లాడు. కారులో లాక్‌ చేసి, అరిస్తే, తన స్నేహితులను పిలిచి గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని బెదిరించాడు.

ఆమె దుస్తులను లాగేసి, ఫొటోలు తీశాడు. వాటిని త‌న స్నేహితుల‌కు వాట్స‌ప్‌లో పంపించాడు. కొద్దిసేప‌టి త‌రువాత ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో విడిచి పెట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఈ-మెయిల్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అందుకున్న వెంట‌నే పోలీసులు శ‌ర‌వేగంగా స్పందించారు.

మూడు గంటల్లోనే క్యాబ్‌ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అత‌ని పేరు అరుణ్ అని వెల్ల‌డించారు. ఈ విషయాన్ని ఓలా క్యాబ్స్‌ దృష్టికి తీసుకెళ్లామ‌ని డీసీపీ సీమంత్ కుమార్ తెలిపారు. ఆ డ్రైవర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టామ‌ని, అతనిపై చర్యలు తీసుకుంటామ‌ని ఓలా అధికార ప్రతినిధి ఒకరు ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *