రథ సారధినీ.. ఫైనల్ చేసారు

kalynram-to-appear-as-driver-of-ntrs-chaitanya-ratham-in-biopic

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పడు చరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది . ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నాడు . రామారావు భార్య బసవ తారకం పాత్రను హిందీ నటి విద్యాబాలన్ పోషిస్తున్నారు . ఇక రామారావు అల్లుడు నారా చంద్ర బాబు నాయుడు పాత్రను రానా దగ్గుబాటి పోషిస్తున్నాడు .

Related image

బాలకృష్ణ , చంద్ర బాబు పాత్రల విషయంలో దర్శకుడు క్రిష్ ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది . ఈ సినిమాకు ముందు దర్శకుడు తేజను అనుకున్నారు . అయితే తేజ ఈ ప్రాజెక్టుకు న్యాయం చేయలేనని తప్పుకున్నాడు . అప్పుడు అనేక మంది దర్శకుల పేర్లు తెర మీదకు వచ్చాయి . దర్శకుడు రాఘవేంద్ర రావు అయితే ఈ సినిమాలో కనీసం ఒక షాట్ అయినా దర్శకత్వం వహించాలని ఉందని ముహూర్తం రోజు ప్రకటించాడు . అయినా బాలకృష్ణ క్రిష్ ను ఎంపిక చేసుకున్నాడు . Related imageగౌతమీపుత్ర శత కర్ణి సినిమాను రికార్డు టైములో తీయడంతో పాటు చాలా ప్రతిభావంతంగా రూపొందించాడని బాలకృష్ణ ఎన్నో సార్లు చెప్పాడు . క్రిష్ అంటే బాలకృష్ణకు అంత నమ్మకం . ఈ నమ్మకాన్ని క్రిష్ నిజం చేస్తాడని మేకప్ స్టిల్స్ చూస్తే తెలుస్తుంది .

ఈ సినిమాను జనవరి నాటికి విడుదల చెయ్యాలనే సంకల్పంతో వున్నారు . ఈ సినిమాకు బాలకృష్ణ ప్రధాన నిర్మాత. మిగతా ఇద్దరు సహా నిర్మాతలు .

Related image

ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుంది . ఎప్పడికప్పుడు తీసిన సినిమా రష్ ను బాలయ్య చూసిన తరువాత ఎడిటింగ్ చేస్తున్నారని , బాలకృష్ణ కూడా ఎడిటర్ దగ్గర కూర్చుని మరీ చేయించు కుంటున్నాడని తెలిసింది. ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది . బిజినెస్ కూడా బాగా జరిగే అవకాశం వుంది .

Related image

ఈ సినిమాలో అక్కినేని పాత్రకు సుమంత్ ఎంపికయ్యాడు, హరికృష్ణ పాత్రను నందమూరి కళ్యాణ్ రామ్ ధరిస్తున్నాడు .

రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఆంధ్ర దేశమంతా రామారావు చైతన్య రథం మీద చుడిగాలి లా ప్రయాణించాడు . ఆ చైత్య రధాన్ని ఆనాడు హరికృష్ణ నడిపించాడు . ఇప్పుడు సినిమాలో కళ్యాణ్ రామ్ నడిపించబోతున్నాడు .
kalynram-to-appear-as-driver-of-ntrs-chaitanya-ratham-in-biopic

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *