
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసారిగా తెరకెక్కుతున్న చిత్రం “అరవింద సమేత”. హారిక హాసిని క్రియేషన్స్ పై కె.రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈషా రెబ్బ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ శీణీమాఆ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇంకో 40 రోజుల్లో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి పంపేదిసాగా సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి స్థాయి రాయల సీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా చాలా కొత్తగా కనిపించనున్నట్టు సమాచారం. ఇక నాగబాబు, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ , రావురమేష్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తూన్నాడు. దసరా కానుకగా అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.