ఎన్టీఆర్ న్యూ మూవీ న్యూ టైటిల్ ?

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నాడు .. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకి ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ కి ఫీడ్ బ్యాక్ సరిగ్గా రాకపోవడంతో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడట.

కథను .. అందులోని కొత్తదనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి ‘రా రా కుమారా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరింత స్లిమ్ గా ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ మేకప్ విషయంలోను ప్రత్యేకత కనిపించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *