ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ మూవీకి రాజ‌మౌళి పెట్టిన టైటిల్ ఇదేనా..?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి…యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ బాక్స‌ర్స్‌లా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం పైన రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తూ.. ఆ ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తేల్చేసారు.
ఇదిలావుంటే… ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఈ మూవీకి ‘ఇద్దరూ ఇద్దరే’ అనే టైటిల్‌ను రాజమౌళి పరిశీలిస్తున్నార‌ని. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలు రెండూ సమానంగా ఉంటాయట. ఈ రెండు పాత్రలు కూడా పోటీపడుతూ సమాంతరంగా సాగుతాయి. అందువల్లనే ఈ టైటిల్ అయితే కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.
అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందే ఈ సినిమాపై అంచ‌నాలు ఏరేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌రి… బాహుబ‌లితో చ‌రిత్ర సృష్టించిన జ‌క్క‌న్న ఈ మూవీతో చ‌రిత్ర‌ని తిర‌గ‌రాస్తారేమో చూడాలి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *