ఎన్టీఆర్, చరణ్ ల పాత్ర వివరాలు

ntr ramcharan multistarrer

ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి తీయబోయే చిత్రం పైనే వుంది. ఎన్టీఆర్ ..చరణ్ ల కాంబినేషన్లో ఆయన చేసే మల్టీ స్టారర్ చిత్రం పైనే అందరి ధ్యాస వుంది. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ ల పాత్రలు ఎలా వుండనున్నాయనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో అన్నయ్యగా ఎన్టీఆర్ .. తమ్ముడిగా చరణ్ కనిపించనున్నారనేది తాజాగా అందుతున్న సమాచారం.
అయితే ఇంతకుముందు వినిపించినట్టుగా ఇది క్రీడా నేపథ్యానికి సంబంధించినది కాదు .. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలు పెనవేసుకున్నదిగా ఈ కథ కనిపిస్తుంది. ఇక అన్నయ్యగా ఎన్టీఆర్ పాత్రను .. తమ్ముడిగా చరణ్ పాత్రను రాజమౌళి ఎలా తీర్చిదిద్దనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి .

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *