ఎన్టీఆర్ తో మరో మూవీ చేయనున్న స్టార్ డైరెక్టర్

ఎన్టీఆర్ తో కొరటాల శివ చేసిన ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి కొరటాల సన్నాహాలు మొదలుపెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ .. చిరంజీవి కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలోను వినోదంతో పాటు అంతర్లీనంగా సందేశం ఉంటుందని అంటున్నారు. ‘సైరా ‘ తరువాత చిరంజీవి చేసే ప్రాజెక్టు కొరటాలదే. ఆ దిశగా పనులు జరిగిపోతూనే వున్నాయి.

ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి కొరటాల స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *