
RRR లో ఎన్టీఆర్ లుక్ ఎవరు ఊహించని విధంగా ఉండబోతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం RRR . ఎన్టీఆర్ తాజాగా విడుదలైన చిత్రం అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ సినిమా సక్సెస్ అయ్యున నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫోకస్ అంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫై పెట్టాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో తారక్ , రామ్ చరణ్ లు కలిసి నటిచనున్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీగా కష్టపడుతున్నారంట.
Also Read : –> బ్రాహ్మణి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చూసి అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించింది
అయితే ఈ చిత్రం కోసం తన లుక్ ను పూర్తి గా మార్చుకోనున్నాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇందుకోసం జింబాబ్వే కు చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లోయ్డ్ స్టీవెన్స్ తో రాజమౌళి ఎన్టీఆర్ లుక్ గురుంచి చర్చించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈచిత్రం నవంబర్ లేదా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ఎవరు ఊహించని విధంగా ఉండబోతుందని తాజా సమాచారం.