
బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా రేసులో నిలిచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రాయలసీమ, నైజాం మరియు కర్ణాటక ఏరియాల్లో ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ ని సాధించడం తో మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

సినిమా ఇప్పటికి బాక్స్ ఆఫీస్ దగ్గర 97.58 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 2.5 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటే సినిమా 86 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో చోటు దక్కించుకుంటుంది. కాగా ప్రస్తుతం సినిమా పరిస్థితి మాత్రం అందుకును అనుకూలించడం లేదు. రెండు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ తగ్గడంతో కొత్త సినిమాల కోసం మరింత తగ్గనుండటంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడే చాన్స్ ఉంది. మరి ఈ వీకెండ్ ఓ అద్బుతం జరిగితే తప్పితే ఈ రికార్డ్ అందుకునే చాన్స్ తక్కువే అంటున్నారు కానీ జరిగితే మాత్రం చరిత్రకెక్కే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. అరవింద సమేత’ సినిమా కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఈ సినిమా రిలీస్ అయినా 4రోజుల్లోనే రూ. 100కోట్ల గ్రాస్ ని వసూలు చేసిన విషయం అందరికి తెలిసినదే. ఇప్పుడీ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ 165కోట్ల గ్రాస్ ను సాధించగా 100కోట్ల షేర్ ని చేరాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 20 రోజుల్లో 100 కోట్లు సాధించిన సినిమా ఇదే.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఈ విజయం ఆనందం లో ఉన్నారు
ప్రస్తుత్త జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి మల్టీ స్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 5న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇందులో ఆయన విభిన్నమైన లుక్ కనిపిస్తారు.ఓ భారీ యాక్షన్ సీన్ సినిమా మొదలవుతుంది అని సమాచారం.
తన కొత్త సినిమాకి సంభందించిన పనుల్లో రాజమౌళి స్పీడ్ పెంచారు.జనవరిలో మొదలుపెట్టాలి అనుకున్న షూటింగ్ ని నవంబర్ కి మార్చేశారు.నవంబర్ రెండో వారం నుంచే రాజమౌళి కొత్త సినిమా షూటింగ్ షురూ కానుంది.జూనియర్ ఎన్టీఆర్ నవంబర్ 10 నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇప్పటికే అయన ఈ సినిమా కోసం శిక్షణ తీసుకొనే పనిలో ఉన్నారు.