రాజకీయాల్లోకి ఎన్టీఆర్ మనవడు

ఎన్టీఆర్ మనమడు, పురందేశ్వరి కొడుకు హితేష్ చెంచురామ్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. తమ రాజకీయ వారసుడిగా కుమారుడు హితేష్ చెంచురామ్ ను నిలపాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ నుంచి అతన్ని పోటీ చేయించాలా అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పురందేశ్వరి మాత్రం గతంలో కాంగ్రెస్ లో, ప్రస్తుతం బీజేపీలో ఉంటూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక తమ కుమారుడు హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి అసెంబ్లీకి నిలపాలని భావిస్తున్న వీరిద్దరూ, ఏ పార్టీ నుంచి పోటీకి దింపాలన్న విషయమై నిర్ణయం తీసుకోలేదట.

పురందేశ్వరి గారు బీజేపీ నుంచి హితేష్ ను బరిలోకి దింపడానికి ఏ ఆటంకం ఏమీ లేనప్పటికీ, గెలుపు అవకాశాలు చాలా తక్కువగ ఉంటాయని భావిస్తున్నారట. తమ కుటుంబాల మధ్య ఎన్ని విభేదాలున్నా, లోకేష్, హితేష్ ల మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఆయన టీడీపీ నుంచి బరిలోకి దింపిన ఆశ్చర్యపోనవసరం లేదని దగ్గుబాటి అనుచరగణం అంటుంది. మరోపక్క, అటు వైకాపా, ఇటు కాంగ్రెస్ కూడా హితేష్ పట్ల సానుకూలంగానే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్ లో ఉన్న హితేష్ చెంచురామ్ ఏ పార్టీ వైపు వెళతారో త్వరలోనే తేలుతుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *