
మహానటి ఆడియో రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నాగార్జున, ఎన్టీఆర్, నానిలతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ పిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్, మహానటి సావిత్రిగా నటించిన కీర్తి సురేష్‌ల పిక్ అది.
ఈ పిక్‌ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు వెంటనే సీనియర్ ఎన్టీఆర్, ఎవర్ గ్రీన్ అందాల నటి సావిత్రి ఓ వేడుకలో కూర్చొన్న పిక్‌ను జత చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాదాపు ఆ రెండు పిక్స్ ఒకేలా ఉండటమే కాకుండా.. కూర్చొన్న విధానం కూడా దాదాపు ఒకేలా ఉండటం విశేషం. ఈ పిక్ బాగా వైరల్ అవడమే కాకుండా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. నాగ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.