
నటసార్వభౌమ సర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా అయన తనయుడు నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఎన్.టి.ఆర్ బయోపిక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. మొదట ఒకే సినిమాగా వదలాలనుకున్న ఈ బయోపిక్ కాస్త రెండు పార్టులుగా వస్తుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా వస్తుండగా మహానాయకుడు సినిమాను జనవరి 24న రిలీజ్ ప్లాన్ చేశారు.
అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరక్షన్ ఛాన్స్ తేజ కి దక్కింది. అదే టైం లో రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా చేస్తానన్నాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించగానే ఆ ఛాన్స్ తనకు వస్తుందని ఆశించాడు ఆర్జివి. కానీ ఛాన్స్ దక్కకపోవడంతో బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను దసరాకు మొదలు పెట్టిన వర్మ జనవరి 24న రిలీజ్ చేస్తానంటూ ఛాలెంజ్ చేశాడు. ఎన్.టి.ఆర్ రెండో పార్ట్ కూడా అదే డేట్ న రిలీజ్ కానుంది సంగతి మనకి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం రెండు పార్టులుగా విడుదలవుతున్న ఈ చిత్రం రెండో పార్టు ఎన్.టి.ఆర్ మహానాయకుడు మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నారట. మొదటిగా ఈ చిత్రాన్ని జనవరి 24 న విడుదల చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. వర్మ సినిమాకు భయపడి కాదు రెండు సినిమాలకు కనీసం ఒక నెల అయినా గ్యాప్ ఉండాలన్న ఉద్దేశంతో మహానాయకుడు సినిమాను వాయిదా వేస్తున్నారని తాజా సమాచారం.