ఎన్టీఆర్ బయోపిక్, తెరపైకి మరో దర్శకుడి పేరు!

ఎన్టీఆర్ బయోపిక్, తెరపైకి మరో దర్శకుడి పేరు!
దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారణగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమా కొంత కాలం క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ అనూహ్యంగా తప్పుకున్నాడు. దీంతో చిత్ర యూనిట్ దర్శకుల వేట ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెరపైకి చంద్ర సిద్ధార్థ్ పేరు వినిపిస్తోంది. ఆ నలుగురు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌క‌త్వం బాల‌కృష్ణే వ‌హిస్తార‌ని సమాచారం. ఇదివరుకే చంద్ర సిద్ధార్థ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.

రాఘవేంద్రరావ్ ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని వార్తలు వచ్చాయి, కాని ఆ న్యూస్ లో నిజం లేదని సమాచారం. అన్ని కుదిరితే ఈ వారం నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *