
ఏపీలో యుద్ధం మొదలయ్యిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే.. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. వైసీపీ-జనసేన-బీజేపీ కుట్రలు ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ నమ్మకద్రోహాన్ని…దానికి వంత పాడుతున్న పార్టీల తీరును జనం అర్థం చేసుకుంటున్నారని బాలయ్య వివరించారు. 2019లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను సంక్రాంతికి విడుదల చేస్తామని..ఇది ఎన్నికల కోసం మాత్రం కాదన్నారు బాలకృష్ణ.