ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌హేష్‌, రానా పాత్ర‌లివే..!

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ఎన్టీఆర్ పేరుతో సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది . ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం కోసం పాత్ర‌ల ఎంపిక జ‌రుగుతుంది. ఎన్టీఆర్ పాత్రలో బాల‌య్య న‌టించనుండ‌గా, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఇక ఎన్టీఆర్ జీవితంలో కీలకంగా ఉన్న ఏఎన్ఆర్ పాత్ర కోసం నాగ చైత‌న్య‌ని ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం కృష్ణ పాత్రని మ‌హేష్ బాబు , చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ని రానా చేయ‌నున్న‌ట్టు టాక్‌. మోహ‌న్ బాబు, రాజ‌శేఖ‌ర్ కూడా ఈ బ‌యోపిక్‌లో ముఖ్య పాత్ర‌లు చేయ‌నున్నార‌ట‌. చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ ఫిలిం సిటీలోను, రామ కృష్ణ సినీ స్టూడియోలో చిత్రీక‌రించున్నార‌ట‌. ఎన్టీఆర్ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో సినిమాని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న బాల‌య్య పాత్ర‌ల ఎంపిక‌లో మంచి పేరున్న న‌టీన‌టుల‌నే తీసుకోమ‌ని చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు అడుగ‌లు వేస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *