
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరుకి రికార్డులు క్రియేట్ చేయడం కొత్తేమి కాదు, తన చిన్నతనం కెరియర్ మొదట్లోనే బాక్సాఫీస్ ను షేక్ ఆడించిన ఘనత ఎన్టీఆర్ ది అయితే మరోసారి తన సినిమా చరిత్ర సృష్టించే హిట్ సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్టీఆర్.
ప్రస్తుతం చేస్తున్న అరవింద సమేత సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ లో కొంతకాలంగా చూడని ఎమోషన్ మాస్ అంశాలతో త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాతో అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇస్తాడట. ఎన్టీఆర్ అంటే మొదట మనకు గుర్తుకువచ్చేది మాస్ సినిమాలు, ఒక్కప్పుడు కేవలం మాస్ సినిమాలు నే ఎక్కువగా చేసవాడు ఎన్టీఆర్ కూడా..తర్వాత గేర్ మర్చి TEMPER సినిమా నుండి చాలా మారిపోయాడు మన మాస్ హీరో..వరసపెట్టి డిఫరెంట్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొట్టాడు.
ఇక అది కనుక ఆడియెన్స్ కు రీచ్ అయితే సినిమా రికార్డులు సృష్టించడమే కాదు చరిత్రలో నిలిచిపోయే హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.