అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ మరియు సునీల్ క్యారెక్టర్స్ ఇవే…

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా తాజా చిత్రం అరవింద సమేత వీరరాఘవ. ఈ సినిమాలో సునీల్ మళ్లీ కమెడియన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ చిత్రలో ఎన్టీఆర్ మరియు సునీల్ క్యారెక్టర్స్ పై కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సునీల్ ని గురువు గారు గురువు గారు అని సంబోధిస్తాడని తాజా సమాచారం.

గురువు గారు గురువు గారు అంటుంటే మీకు ఎన్టీఆర్ అదుర్స్ సినిమా గుర్తుస్తుంది కదూ.. అవునండి ఇది నిజమే, ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కామిడి చేయించి వి వి వినాయక్ సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ – బ్రహ్మనందం మధ్య సాగిన సన్నివేశాలు ప్రేక్షకులని బాగా నవ్విచాయి. ముఖ్యగా ఎన్టీఆర్ బ్రహ్మానందం ని గురువు గారు గురువుగారు అంటూ బ్రహ్మానందాన్ని పిలవడం దానికి బ్రహ్మి ఇచ్చే ఎక్సప్రెషన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

అయితే ఈ సినిమాలో సునీల్ 90 శాతం సీన్లలో కనిపిస్తాడట. ఆఖరికి ఓ డ్యూయట్ సాంగ్ లో కూడా సునీల్ కనిపించబోతున్నాడని తాజా సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్, సునీల్ మధ్య సీన్ లు, పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని టాలీవుడ్ టాక్. ఈ సినిమా తో సునీల్ మల్లి కమెడియన్ గా బిజీ కావడం ఖాయం అంటున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *