
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హైదరాబాద్ లో అడుగుపెట్టవద్దని ఆదేశించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో పాటు డీసీపీలు, ఉన్నతాధికారులు సమావేశమై, కత్తి మహేష్ నగరంలో ఉంటే ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆలోచనతో ఆయనపై బహిష్కరణ విధించారు.
శ్రీరాముడిని విమర్శించిన కత్తి మహేష్ పై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, కత్తి వ్యాఖ్యలను నిరసిస్తూ… స్వామి పరిపూర్ణానందస్వామి హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని సిద్ధమయ్యారు. అయితే, పోలీసులు అయన యాత్రకు అనుమతిని నిరాకరించి ఆయనను గృహనిర్బంధం చేశారు.