నిర్భయ రేపిస్టులకు ఉరే: ఖరారు చేసిన సుప్రీం

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షను విధిస్తూ సోమవారం నాడు తీర్పును వెలువరించింది.జీవితఖైదుగా మార్చాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నిర్భయ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నాడు తుది తీర్పు వెలువరించింది. 2012 లో ఢిల్లీలో నిర్భయపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైలులో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో మైనర్ బాలుడికి మూడేళ్ల శిక్ష విధించింది కోర్టు.

అయితే అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై నిందితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీనిపై ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు తీర్పును వెలువరించింది.

ఈ కేసులో శిక్ష పడిన మైనర్ బాలుడికి మూడేళ్ల జైలు శిక్ష పూర్తై విడుదల అయ్యారు. ఇక సుప్రీంకోర్టులో ముగ్గురు నిందితులు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. నాలుగో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్ తరపు న్యాయవాది కూడ త్వరలోనే పిటిషన్ ను దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టులో అక్షయ్ కుమార్ సింగ్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేస్తే నిందితులకు శిక్ష పడే విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును వెలువరించింది.

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టుతో పాటు ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులను త్రిసభ్య ధర్మాసనం సమర్థించింది. ఈ కేసులో దోషులు, తమకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ వేసిన రివ్యూ పిటిషన్‌ఫై విచారణ జరిపిన న్యాయస్థానం దాన్ని తోసిపుచ్చింది. ఈ కేసులో త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి వారికి ఉరిశిక్షే సరైనదని తేల్చింది. అయితే క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం వారికి మరో అవకాశం కల్పించింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *