
Narendra Modi Master Plan Aginest TDP in AP
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందో అప్పటినుంచి ఏపీలో యుద్ధ వాతావరణం మొదలైంది. రాజకీయంగా టీడీపీ ని దెబ్బతీసేందుకు తిరుమల రమణదీక్షితుల అంశంతో బీజేపీ చాల ప్రయత్నించింది, అది నెరవేరలేదు. ఆ తరువాత ఆ తర్వాత పీడీ ఎకౌంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి.. చంద్రబాబును చాల ఇబ్బందులు పెట్టారు. వాటికి తలఒగ్గలేదు టీడీపీ ప్రభుత్వం.
టీడీపీ ప్రభుత్వం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కేంద్రప్రభుత్వంపై ధర్నాకు దిగింది. దీనిని క్యాష్ చేసుకుందుకు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది బీజేపీ.అంటే డివైడ్ అండ్ రూల్ పద్దతి. బీజేపీ పన్నిన ఈ కొత్తపన్నాగాన్ని పసిగట్టిన టీడీపీ పరభుత్వం వారిపై ఎదురుదాడికి దిగింది. దీనితో కమలనాథులు వెనక్కితగ్గారు.
ఆ తరువాత తమ ప్లాన్ మార్చి టీడీపీని దెబ్బతీసేందుకు పాత ఫార్ములాను బయటకు తీసింది బీజేపీ ప్రభత్వం. అదే ఐటీ దాడులు. ఈ దాడులతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. అలాగే ఓటుకు నోటు కేసును బయటకులాగి చంద్రబాబును ఇరుకున పెట్టాలని చాల ప్రయత్నాలు చేసింది. టీడీపీ ఎదురుదాడి చేయడంతో ఐటీ దాడులు ఆగిపోయాయి. తాజాగా అగ్రిగోల్డ్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. అయితే దేనికీ భయపడబోమని, ఎంతకైనా సిద్ధమని టీడీపీ నేతలు ప్రకటించారు.
ఎన్ని ప్రయత్నాలు చేసిన టీడీపీ ని అడ్డుకోలేకపోయిన బీజేపీ మరో పథకాన్ని తెరమీదకి తీసుకొచ్చింది. అదే వైసీసీపీ నేత జగన్, జనసేన నేత పవన్ కళ్యాణ్ తో కుమ్మక్కై టీడీపీ పై ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉంది. జగన్, పవన్‌తో బీజేపీ తెరవెనుక ఉప్పందం కుదుర్చుకుందని టీడీపీ మొదటినుంచీ ఆరోపిస్తూ వస్తోంది. దానిని నిజంచేస్తూ బీజేపీ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీశాయి. ఒక ప్రక్క పవన్ తుపాను బాదితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గవర్నర్ నరసింహన్‌ను కలవడం పైగా ప్రధానికి లేక రాస్తాననడం చూసుంటే బీజేపీ ని పవన్ వెనుకేసుకొస్తున్నాడని తెలుస్తుంది. దీనిబట్టి చుస్తే టీడీపీ నాయకులూ చేస్తే ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.