Nara Brahmani surprise gift to NTR

#NaraBrahmani #SurpriseGift #NTR
Nara Brahmani surprise gift to NTR
ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్యంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. దసరా కానుకగా అక్టోబర్ 11 న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డులు అన్నిటిని చెరిపివేస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకి ఇటు
ప్రేక్షకులు అటు నందమూరి అభిమానులను ఫిదా అయిపోయారు. ఇప్పటివరకు ఈ చిత్రం 150 కోట్లు సాధించి 200 కోట్లు వైపు పరిగెడుతుంది.

ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రం సక్సెస్ మీట్ ఈ రోజు శిల్ప కళావేదికలో జరుగుతున్నా సంగతి తెలిసిందే. అయితే హరికృష్ణ మరణించకముందు నందమూరి హీరోల మధ్యన విభేదాలున్నాయని ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి వారు హ్యాపీగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సక్సెస్ మీట్ కి బాబాయ్ బాలకృష్ణ వస్తున్నాడు కూడా.

ఇదంతా ప్రక్కనపెడితే నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య అయిన బ్రాహ్మణి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చూసి అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. అంతేకాదు విజయదశమి సందర్భంగా తన అన్న ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను కూడా పంపించింది. హరికృష్ణ కు సంబందించిన పాత ఫొటోలు కలెక్ట్ చేసి వాటిని ఒక సిడిలో ఆల్బమ్ లా క్రియేట్ చేసి పంపించారు.

దీంతో తారక్ చెల్లి పంపిన ఆ గిఫ్ట్ కు ఎంతో మురిసిపోయి తండ్రిని తలచుకొని భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్నాడు. తన తండ్రిని మనస్ఫూర్తిగా తలుచుకునేలా చేసిన తన చెల్లలు నారా బ్రాహ్మణికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *