‘సవ్యసాచి’ సెన్సార్‌ రిపోర్ట్

naga-chaitanya-savyasachi-censore-report

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ఇది కలిసొచ్చే కాలమే. కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ తరుణంలో నాగచైతన్య సవ్యసాచితో రాబోతున్నాడు. తన మాట వినని ఎడమచేతితో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు.. అసలు ఆ కథేంటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ శుక్రవారం ఆడియన్స్‌ ముందుకు రాబోతున్నాడు.

Savyasachi
Savyasachi

రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌, సాంగ్స్‌తో సినిమాపై పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ క్రియేట్‌ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బృందం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. మాధవన్‌, భూమిక, నిధి అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్‌ 2న థియేటర్లలో సందడి చేయనుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *