ల‌క్ష్మీ పార్వ‌తి ఇంట్లో మ‌ల్టీ స్టార‌ర్ మూవీ షూటింగ్

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ హ‌వా కొన‌సాగుతుంది. స్టార్ హీరోలు సైతం మ‌ల్టీ స్టార‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. రానున్న నెల‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించ‌డం ఖాయం అంటున్నారు. అయితే న‌టుడి నుండి ద‌ర్శ‌కుడిగా మారిన అవ‌స‌రాల శ్రీనివాస్ సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ త‌న‌యుడు న‌వీన్ విజ‌య్‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్నాడ‌ట‌.
Image result for avasarala srinivas
బాలాజీ అనే డెబ్యూ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడ‌ని అంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్ర షూటింగ్ ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ పార్వ‌తి ఇంట్లో జ‌రుగుతుంద‌ట‌. ద‌ర్శ‌కుడు చిత్రానికి సంబంధించి క్రూషియ‌ల్ సీన్స్ తెర‌కెక్కిస్తుండ‌గా, ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన నటీన‌టులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు మూవీ మేక‌ర్స్‌.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *