తెలంగాణ నుంచి ఆ పార్టీ ఎంపీగా పోటీ లగడపాటి !

MP Lagadapati Rajagopal’s back to politics from telangana state
అవకాశం ఇస్తే వచ్చే ఏడాది తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తాను, తన వారసులుకానీ రాజకీయాల్లోకి రారని స్పష్టంచేశారు. బుధవారం రాత్రి ఆయన దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. ‘‘రాష్ట్రం విడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానని 2009లోనే చెప్పాను. ఆ మాటకు కట్టుబడే పూర్తిగా దూరమయ్యాను. దేశంలో వీస్తున్న రాజకీయ గాలుల గురించి ఇప్పుడే చెప్పను. ఐదు రాష్ట్రాల ఎన్నికల సర్వే ఫలితాలను డిసెంబర్‌ 7న వెల్లడిస్తా. ప్రస్తుతం నాపేరుతో సామాజిక మాధ్యమాల్లో అబద్ధపు సర్వేలు ప్రచారం చేస్తున్నారు.

వాటిని నమ్మొద్దు. ఒకవేళ నేను ఏదైనా చెప్పదలచుకుంటే నేరుగా మీడియాముందుకొచ్చి వెల్లడిస్తా. ముందుగానే సర్వే ఫలితాలు ఎలా ఉండబోతున్నదీ అంచనా వేసి చెప్పగలను… ప్రధాన రాజకీయపార్టీలు కోరితేనే ఆ పనిచేస్తా. గత ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ముందే ఎవరు గెలుస్తారో చెప్పడంవల్ల ఓటర్లు ప్రభావితమయ్యారని నాపై కేసుపెట్టారు. అందుకే ఈసారి పార్టీలు అడిగితేనే చెప్పాలనుకుంటున్నా.

Lagadapati-Rajagopal-Latest-Survey-Report

ముందే చెబితే నచ్చేవాళ్లు మెచ్చుకుంటారు, నచ్చనివాళ్లు తిడుతుంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల కలయిక ఎలా ఉంటుందన్నది ఆ రాష్ట్ర ప్రజలే చెప్పాలి. ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు జరుగుతోంది.. అంతా అయ్యాక అంచనావేస్తా. ఇప్పుడు ఏం మాట్లాడినా రాజకీయంగా ఏదో ఆశించి చెప్పారని అనుకుంటారు. అందుకే దేనిపైనా మాట్లాడను. నన్ను మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఎక్కడికిపోయినా ప్రజలు అడుగుతున్నారు.

ఇటీవల మెదక్‌ జిల్లాకు వెళ్లినప్పుడు ప్రజలు, పోలీసులు చుట్టుముట్టి రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణ నుంచి పోటీచేయాలని అడిగారు. అవకాశం వస్తే ఆంధ్రాలో పోటీచేస్తానో లేదోకానీ తెలంగాణలో మాత్రం పోటీచేస్తానని వాళ్లకు చెప్పాను. ఏపీలో భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదగకూడదని నిర్ణయించుకున్నా. అందువల్ల తెలంగాణలో అవకాశం వస్తే అసెంబ్లీకి కాకుండా వచ్చే ఏడాది పార్లమెంటుకు పోటీచేస్తా’’ అని లగడపాటి రాజగోపాల్‌ వివరించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *