
సురేష్ బాబు కారుకి యాక్సిడెంట్
tollywood producer daggubati suresh babu in car accident
ప్రముఖ సినీ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు కారు ప్రమాదానికి గురైంది. ఈరోజు దగ్గుబాటి సురేష్‌బాబు తన కారులో సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ వైపుగా ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ బైక్ రాంగ్ రూట్లో సడెన్‌గా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.
దీంతో ఆయన కారు.. బైక్‌ను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న దంపతులతో పాటు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు