జన్మభూమి గురుతులు చెట్ల సంరక్షణలో గ్రామస్థుల ఆదర్శం

టేకుచెట్లపాలెం
జన్మభూమి గురుతులు
చెట్ల సంరక్షణలో గ్రామస్థుల ఆదర్శం
న్యూస్‌టుడే, రావివారిపాలెం(మోపిదేవి)
జన్మభూమి.. ఆ గ్రామానికి స్ఫూర్తినిచ్చింది. పర్యావరణ సమతుల్యానికి ప్రాధాన్యమివ్వాలనే ప్రభుత్వ ఆశయాన్ని అందుకున్న ఆ గ్రామస్థులు 15 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు నేడు కల్పవృక్షాలుగా మారాయి. ఇళ్ల ముంగిట నిటారుగా పెరుగుతూ టేకుచెట్లు ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అదే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి పంచాయతీ శివారు గ్రామమైన రావివారిపాలెం. గ్రామంలో దాదాపు 300 ఇళ్లుంటే 250పైగా గృహాల్లో ప్రతి ఇంటి వద్ద ఒకటికి మించి పదిలోపు టేకుచెట్లు కనిపిస్తాయి. దీంతో ప్రస్తుతం ఆ గ్రామాన్ని టేకుచెట్ల రావివారిపాలెంగా పిలుస్తారు.
2002-2003లో అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన పేరుతో చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఆసక్తి ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం టేకు మొక్కలు పంపిణీ చేయడం నేడు రావివారిపాలెంకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం అందించిన టేకు మొక్కలను గ్రామస్థులు శ్రద్ధగా పెంచడం, వాటిని చూసి మరికొందరు కొని తీసుకొచ్చి పెంచే అలవాటు చేసుకున్నారు.


స్థిరాస్తిగా మారాయి
– కంఠంనేని కుటుంబరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
పర్యావరణ సమతుల్యానికి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు కూడా ‘వనం..మనం’ కింద రూ.కోట్లలో వెచ్చిస్తూ మొక్కలను సరఫరా చేస్తోంది. అప్పట్లో ఇచ్చిన మొక్కలే మాకు పేరు తెచ్చాయి. నేడు స్థిరాస్థిగా మారాయి.
గ్రామం పేరు : రావివారిపాలెం
జనాభా : 2000పైనే
ఇళ్ల సంఖ్య : 300
టేకు చెట్లు పెంచుతున్న
గృహాల సంఖ్య : 250పైనే

News : eenadu

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *