
మోడల్‌పై జనసేన కార్యకర్తల ప్రచారం…. భగ్గుమన్న బాధితురాలు
రెండు రోజులుగా పవన్ కల్యాణ్ అభిమానులు వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు ప్రస్తావించసాధ్యంకానంత ఇబ్బందికరంగానే ఉంటున్నాయి.
జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో పవన్ కల్యాణ్ అభిమానులు ప్రముఖ మోడల్ అలేఖ్యను లాగారు. గతేడాది జగన్‌తో కలిసి అలేఖ్య ఒక సెల్పీ దిగగా.. ఆ ఫొటోను ఆమె ఎఫ్బీ టైం లైన్ నుంచి తీసుకొచ్చి దారుణంగా వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో బాధితురాలు అలేఖ్య సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. ఇలాంటి పోస్టులు ఎలా పెడుతున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నా స్థానంలో మీ చెల్లి ఉన్నా ఇలాగే ఆ ఫొటోలతో ఇలా ప్రచారం చేస్తారా… అని ఆమె ప్రశ్నించారు. జగన్‌తో దిగిన సెల్ఫీపైనా వివరణ ఇచ్చారు.
2017 ఫిబ్రవరిలో ఒక సీడీ లాంచింగ్ కోసం తన కుటుంబసభ్యులతో పాటు వెళ్లి లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిశానని ఆమె వివరించారు. జగన్‌తో తన కుటుంబసభ్యులున్న ఫొటోను కూడా జనసేన కార్యకర్తల కోసం ఆమె పోస్టు చేశారు.
సీడీ లాంచింగ్ తర్వాత తామే అడిగి జగన్‌తో సెల్ఫీ దిగినట్టు ఆమె వివరించారు. జగన్‌ను ఒక తండ్రిగా, ఒక అన్నగా తాము భావించి సెల్పీ దిగినట్టు వివరించారు. జగన్‌ను డిఫేం చేసే క్రమంలో తనను ఎందుకు లాగుతున్నారని జనసేన కార్యకర్తలను ఆమె ప్రశ్నించారు. తాను కూడా పవన్ కల్యాణ్ అభిమానినేనని అలేఖ్య వివరించారు. అమ్మాయిలపై పోస్టులు పెట్టే ముందు ఆలోచించుకోవాలని విజ్జప్తి చేసింది. నా స్థానంలో మీ చెల్లెలు ఉంటే మీరు ఎలా స్పందిస్తారని జనసేనను ఆమె ప్రశ్నించింది.
ఇలాంటి చర్యల వల్ల పవన్ కల్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే కాకుండా…. ఒక అమాయక అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారన్న విషయాన్ని పవన్ అభిమానులుమరిచిపోవద్దని ఆమె కోరారు. ఇల్లేమో దూరం… అసలే చీకటి అంటూ పవన్ కల్యాణ్ ప్రస్తావించే కొటేషన్లు కూడా ఆమె ఈ సందర్బంగా ప్రస్తావించారు. నిజానికి అలేఖ్య… చంద్రబాబు, వెంకటేష్, బాలకృష్ణతో పాటు ఎంతో మంది ప్రముఖలను కలిసి వారితో సెల్ఫీలు తీసుకున్నారు.
అయితే ఇప్పుడు జగన్‌తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ బూతు కామెంట్లు పెడుతున్నారు.