కళ్యాణ్ రామ్ MLA ప్రీమియర్ షో రివ్యూ

కళ్యాణ్ రామ్ MLA ప్రీమియర్ షో రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్
       పటాస్ తో టాలీవుడ్ లో మళ్ళీ అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కి ఆ వెంటనే షేర్ మరియు ఇజం సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ ఇవ్వలేక ఫ్లాఫ్ అయ్యాయి. ఇలాంటి సమయం లో పటాస్ లాంటి కంటెంట్ తో MLA అంటూ సరికొత్త ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. మరి కొన్ని గంటల్లో అఫీషియల్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఈస్ట్ కంట్రీస్ లో….

సాయంత్రం 6:30 నుండే స్పెషల్ షోలతో రిలీజ్ అయ్యింది…..అక్కడ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… చిన్న పిల్లలాకు చదువు ఎంత ముఖ్యమో అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ MLA గా నటించాడు.

కాజల్ కి సినిమాలో నటించే స్కోప్ ఉన్న పాత్ర దొరికిందని అంటున్నారు. సినిమా కాన్సెప్ట్ ప్రాధమిక చదువు అవసరం గురించే అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ అడుగడుగునా ఉంటాయని అంటున్నారు. అవి కొన్ని సమయాల్లో రొటీన్ అయినా అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది అంటున్నారు.

సంగీతం యావరేజ్ గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుందని, బ్రహ్మానందం రోల్ కొంతవరకు నవ్విస్తుందని అంటున్నారు. కళ్యాణ్ రామ్ కి పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి అన్ని యాంగిల్స్ లో ఎంటర్ టైన్ చేసే రోల్ ఈ సినిమాలో దక్కింది అంటున్నారు.

ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని…సినిమా రిచ్ గా ఉందని అంటున్నారు. దర్శకుడు ఉపేంద్ర మాధవ్ కళ్యాణ్ రామ్ ని పటాస్ రోల్ కి సీక్వెల్ గా అనిపించే క్యారెక్టర్ లో బాగానే ప్రొజెక్ట్ చేశాడని అంటున్నారు. సినిమాకి లెంగ్త్ కూడా కలిసి వచ్చే అంశమే అంటున్నారు.

ఓవరాల్ గా సినిమా మరీ పటాస్ లెవల్ లో అన్ని విభాగాల్లో ఫుల్ మార్కులు వేయించుకోకపోయినా ఆ సినిమా తర్వాత ది బెస్ట్ అనిపించే విధంగా ఉందని అంటుండటం విశేషం. సమ్మర్ లో ఎంటర్ టైనమెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఓవర్సీస్ నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే టాక్ ని సొంతం చేసుకుంటే పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి నికార్సయిన హిట్ పడినట్లే నని అంటున్నారు. చూద్దాం ఎం జరుగుతుందో…

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *